అనుమతి లేని ప్రైవేట్ హాస్టల్స్ సీజ్ చేయాలి

అనుమతి లేని ప్రైవేట్ హాస్టల్స్ సీజ్ చేయాలి

మిమ్స్ హాస్టల్ ను సీజ్ చేసి యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి*

సహస్ర కుటుంబానికి 50లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ డిమాండ్

బెల్లంపల్లి జులై 30(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రైవేట్ హాస్టల్స్ పెట్టి విద్యార్థుల నుండి3000నుండి10,000 వరకు హాస్టల్స్ ఫీజులు తీసుకుంటూ ప్రవేట్ హాస్టల్స్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని,

ఇలాంటి అనుమతి లేని హాస్టళ్ళు పెట్టడం వల్ల విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదని,కాబట్టి తక్షణమే అనుమతి లేని ప్రైవేట్ హాస్టళ్ల పై సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు డీఈఓ, కలెక్టర్ స్పందించి అనుమతి లేని ప్రైవేట్ హాస్టలను సీజ్ చేయాలని,అంతేకాకుండా మంగళవారం అనుమతి లేని మిమ్స్ హాస్టల్ ని నడుపుతున్న హాస్టల్లో కొత్తపల్లి సహస్ర ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి మిమ్స్ యజమాన్య నిర్లక్ష్యం వల్ల హాస్టల్లో కిటికీకి ఎటువంటి గ్రిల్స్ లేకపోవడంతో సహస్ర విద్యార్థిని కింద పడి చనిపోవడం జరిగిందని,ఈ విద్యార్థి చావుకి మిమ్స్ యజమాన్యం బాధ్యత వహించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని,దీనిపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆ హాస్టలును సీజ్ చేయాలని, యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, లేనియెడల అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏఐఎఫ్డిఎస్) ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నామన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!