వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 31 (అఖండ భూమి న్యూస్);
వన క్షేమమే మన క్షేమం అని,అందుకే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటి క్షేమానికి కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం సౌత్ క్యాంపస్ లో వనమహోత్సవం సందర్భంగా సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ,గ్రామీణ ఉపాధి హామీ సంస్థల ఆధ్వర్యంలో దక్షిణ ప్రాంగణంలో 30 వేల మొక్కలు నాటాలని సంకల్పించారు.అందులో భాగంగా ఇప్పటికే 15 వేల మొక్కలు నాటడం పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా ఒకే రోజు సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరై మొక్కలు నాటి,మాట్లాడారు.
ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని రక్షిస్తే అవి ఆక్సిజన్ ఇస్తూ మనకు రక్షణ కల్పిస్తాయి అన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అన్నారు. సౌత్ క్యాంపస్ లో వనమహోత్సవం జరపడం అభినందనీయం అన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వన మహోత్సవాన్ని భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా చెయ్యాలని భావించింది తెలిపారు. అందుకే విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించాలని పిలుపునిచ్చారు. అమ్మ పేరుపై ఒక మొక్క నాటి రక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.మొక్కలు స్పాన్సర్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ప్రతిజ్ఞ, డా.యాలాద్రి లను సన్మానించారు.
ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ క్యాంపస్ లో పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు,పూల మొక్కలు నాటుతున్నామని, అవి భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. సౌత్ క్యాంపస్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం సంస్థ లకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి సురేందర్, భిక్నూర్ ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, తహసిల్దార్ సునీత,రాధిక ,సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి, డా. మోహన్ బాబు,డా.లలిత,డా.హరిత, డా.అంజయ్య,డా.నాగరాజు,డా.ప్రతిజ్ఞ, డా.s.నారాయణ , డా.రమాదేవి,డా.నర్సయ్య, ఏపీ ఆర్వో డా.సరిత, డా.శర్మ, శ్రీకాంత్,దిలీప్,డా.శ్రీకాంత్, డా.సంతోష్ గౌడ్,పోతన్న మరియు విద్యార్థులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.