అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జులై 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పరిధిలోని ఆంగన్‌వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లకు 2025-26 సంవత్సరానికి అవసరమైన గుడ్ల సరఫరా కోసం నిర్వహించిన టెండర్ ప్రక్రియలో భాగంగా, టెక్నికల్ బిడ్‌లను గురువారం ఉదయం 11:00 గంటలకు కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్, కామారెడ్డి లో జిల్లా కలెక్టర్ , జిల్లా కొనుగోలు కమిటీ (డి పి సి) చైర్మన్ ఆసీస్ సాంగ్వన్ ఆధ్వర్యంలో, డిపిసి సభ్యుల సమక్షంలో, బిడ్డర్ల సమక్షంలో తెరవడం జరిగింది. ఇద్దరు బిడ్డర్ లు మాత్రమే పాల్గొనటం జరిగిందన్నారు.
బిడ్డర్ల నుండి అందిన టెక్నికల్ బిడ్‌లను నిబంధనల ప్రకారం పరిశీలించడం జరిగింది అని అర్హత కలిగిన బిడ్డర్లను ఆర్థిక బిడ్డుల దశకు ఎంపిక చేయడం జరిగిందన్నారు.