దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 31,(అఖండ భూమి న్యూస్);
ఆనందిత్ ఫౌండేషన్ నిర్మల్ జిల్లా వారు యువత కు డ్రగ్స్ కు బానిసలుగా మారకుండా,దాని వల్ల కలిగే నష్టాలు ఇబ్బందులు వివరిస్తూ చైతన్యం కల్పించడానికి ఆ సంస్థ పాటలు,కవితలు పోటీని నిర్వహించి పుస్తకం రూపం లో తీసుకరానున్నారు.వారు నిర్వహించిన పోటీల్లో ఉత్తమ చైతన్యం కల్గించే రచనలు చేసినందులకు దోమకొండ కళాశాల జూనియర్ లెక్చర్ శేషారావు వైద్య,అంగన్వాడీ టీచర్ ఉమారాణి వైద్యను అభినందిస్తూ ఆ సంస్థ కార్యదర్శి అనిల్ దుగ్గి సి.ఇ. ఓ లక్ష్మణ్ వాడెకర్,ప్రశంశ పాత్రలను అందించి కవులను అభినందించారు.