అందోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు
( అందోల్ మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 1)
అందోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలో మొదలుకానున్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను అడ్డుకొని తీరుతాం అన్న బిజెపి నాయకులను పుల్కల్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు కాబడిన నాయకులు మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపికి పట్టం కట్టాలని చూస్తున్నారని కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఈ పాదయాత్ర చేపట్టారని ఎవరెన్ని పాదయాత్రలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి చేయలేదని, పూర్తి చేయడం కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యం కాదని ఈ విషయం ప్రజలకు అర్థమైందని కావున వచ్చే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గం అసెంబ్లీ కో కన్వీనర్ సుమన్, మాజీ స్టేట్ కౌన్సిల్ నెంబర్ జగన్నాథం, చౌటకూర్ మండల అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్, ఉమ్మడి పుల్కల్ మండల మాజీ అధ్యక్షులు శివ, జిల్లా నాయకులు భూమయ్య రామకృష్ణ,పాపయ్య తదితరులు పాల్గొన్నారు.