శ్రీశైల దేవస్థానం లో పరిచారకుడు రెహమత్ విద్యాధరు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
శ్రీశైలం అఖండ భూమి న్యూస్, 1 ఆగస్టు
శ్రీశైల దేవస్థానం శ్రీ మల్లికార్జున స్వామి చోరీ 16.07.2025 న తెల్లవారుజామున 02:20 గంటల సమయంలో దేవస్తానం పరిచారకుడు హిరెమత్ విద్యాధర్ శ్రీశైలo దేవస్థానం లో గల శ్రీ మల్లికార్జున స్వామి వారి గర్బగుడి ముందు గల హుండిలోని కొంత డబ్బును దొంగలించినారు అని ఎం.మల్లికార్జున, శ్రీశైల దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంబించినాము.
ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి
హిరెమత్ విద్యాధర్, వయస్సు 47 సం., తండ్రి లేట్. H. మల్లయ్య స్వామి, r/o SRC.39, జగద్గురు మటం దగ్గర, శ్రీశైలం గ్రామం మండలం, నంద్యాల జిల్లా
ముద్దాయి హిరెమత్ విద్యాధర్ శ్రీశైలo దేవస్థానం నందు 2006 సం. నుండి కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత 2 సం.ల నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి గుడి నందు పనిచేయుచున్నాడు. హిరెమత్ విద్యాధర్ జల్సాలకు అలవాటు పడి, చెడు వ్యసనాలకు బానిసై వచ్చే జీతం సరిపోక, సుమారు శ్రీ మల్లికార్జున స్వామి వారి గుడి నందు డ్యూటీలో చేరిన సుమారు ఆరు నెలల నుండి అనగా ఇప్పటికి దాదాపుగా 18 నెలల ముందు నుండి డ్యూటీ సమయం కంటే సుమారు ఒక అరగంట ముందుగా గుడికి వెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హరతికి కావాల్సిన పనులు చూడాలని వెళుతూ, స్వామి వారి ఆలయంలో గల క్లాత్ హుండీ నందు భక్తులు వేసిన నగదును సమయం కుదిరినప్పుడల్లా దొంగలించేవాడు. ఇలా ప్రతిసారి దొంగలించినప్పుడల్లా సుమారు రూ. 10,000 నుండి 20,000 వరకు వచ్చేవి. ఆవిధంగా ఇప్పటివరకు అలా దొంగలించిన సొమ్ము అతని వద్ద సుమారు రూ1,24,200/- ను చూపించి, మిగతా సొమ్ము లో కొంత డబ్బు తో రాయల్ ఈన్ఫీల్డ్ కంపెనీకి చెందిన బులెట్ బైక్ కొన్నాడు దానికి రూ1,55,000/- డబ్బు కట్టినానని మరియు ఇంకా కొంత డబ్బు సుమారు 1,00,000/- పెట్టి తో అతను ఉంటున్న ఇంటికి మరమత్తులు వాడుకోవడమైనది అని చెప్పినాడు. హిరెమత్ విద్యదర్ మొత్తం రూ3,79,200/- మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు శ్రీ మల్లికార్జున స్వామి వారి క్లాత్ హుండీ లో దొంగిలించినాడు.
నడ్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా ఐపీఎస్ ఆదేశాలు మేరకు ఆత్మకూరు డి.ఎస్.పి రామంజి నాయక్ గారి సూచనలు మేరకు శ్రీశైలం సీఐ జి.ప్రసాద రావు మరియు సిబ్బంది రఘునాధుడు, బాలక్రిష్ణ, రాజేంద్ర కుమార్, వెంకట నారాయణ, నాను నాయక్ ముద్దాయి హిరెమత్ విద్యాధర్ ను 2025 వ సంవత్సరం ఆగష్టు నెల 01 తేదీన ఉదయం 11:30 ఉదయం గంటల వ్యవధిలో నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం మరియు , జగద్గురు మఠం వద్ద అరెస్ట్ చేసి ముద్దాయి హిరెమత్ విద్యాధర్ వద్ద నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్లాత్ హుండీ లో దొంగిలించిన నగదు సుమారు రూ1,24,200/- మరియు దొంగిలించిన నగదు తో కొన్న రాయల్ ఇన్ ఫీల్డ్ బులెట్ స్వాదీనం చేసుకోవదమైనది. ముద్దాయి హిరెమత్ విద్యాధర్ ను రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్ట్ కు పంపడమైంది.
ముద్దాయి హిరెమత్ విద్యాధర్ వద్ద నుండి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్లాత్ హుండీ లో దొంగిలించిన నగదు సుమారు రూ1,24,200/- మరియు దొంగిలించిన నగదు తో కొన్న రాయల్ ఈని ఫీల్డ్ స్వాదీనం చేసుకోవదమైనది సీఐ జి వరప్రసాదరావు తెలిపారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..