అర్ధరాత్రి వసతిగృహాల్లో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
(పాపన్నపేట మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 1)
విద్యార్థుల వసతులపై ఆరా పాపన్నపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ నగేష్ రాత్రి
9 గంటల సమయంలో ఆకస్మికంగా పరిశీలించారు.
ముందుగా పరిస్థితి గృహంలో విద్యార్థులతో మమేకమై వారి సామర్థ్యాలను పరిశీలిస్తూ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా,
అనే విషయాలను స్వయంగా విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు కార్పొరేట్ స్థాయి ధీటుగా ప్రభుత్వ సంక్షేమ వసతి. గృహాల్లో విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు
అందుతున్నాయని మంచిగా చదువుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ ఆకాంక్షించారు.