31 మంది అసిస్టెంట్ అభ్యర్థులకు పుదుచ్చేరి షాన్ బాగ హోటల్ లో హార్దిక సమావేశం నిర్వహించిన కామిరెడ్డి సూరిబాబు.
యానం ఆగస్టు 1 (అఖండ భూమి)
యానం నియోజకవర్గం నుండి అసిస్టెంట్ పదవులకు సుమారు 430 మంది రాతపరీక్ష రాయగా,యానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 మంది అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు ఎంపిక కావడం గమనార్హం.. 30వ తారీఖున పుదుచ్చేరి ఉన్నతాధికారుల వద్దకు ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ కొరకు పుదుచ్చేరి వెళ్లిన 31 మంది అభ్యర్థులకు మరియు వారి తల్లిదండ్రులకు పుదుచ్చేరి షాన్-బాగ హోటల్ లో హార్థిక సమావేశం
ఏర్పాటు చేసిన అన్నదాత కామిరెడ్డి సూరిబాబు..
ఈ హార్థిక సమావేశానికి
కామిరెడ్డి సూరిబాబు,
మోటేపల్లి బాబ్జి, ముమ్మిడి చిన్నారి, బొబ్బిలి ప్రసాద్, సుభాన్,ప్రభాకర రెడ్డి,ఎన్.పి.వి.రామారావులు 31మంది అభ్యర్థులను దుశ్శాలువులతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి,ప్రజలకు అందుబాటులో ఉండి, అవినీతి లేకుండా ప్రజలకు సేవచేయాలని తెలిపారు.ఈ సందర్భంగా పలువురు అన్నదాత కామిరెడ్డి సూరిబాబును ఉద్దేశించి మాట్లాడుతూ కామిరెడ్డి సూరిబాబు
పాండిచ్చేరీలో ఎంపికైన అభ్యర్థులకు సత్కారం చేయడం మాత్రమే కాకుండా,యానం నుండి పుదుచ్చేరి ఎవరు ఏ-పనిమీద వెళ్లినా అన్నా నాకు ఈ-పని అవడం లేదని ఒక్కమాట చెబితేచాలు సూరిబాబుకు ఉన్నంతలో టక్కుమని పనులు చేసిపెట్టి కడుపునిండా అన్నంపెట్టి పంపే మనసున్న మహామనిషి మనలో ఒక్కడు కామిరెడ్డి సూరిబాబు అని,అలాంటి నిర్మలమైన సేవాభావం ఈ కాలంలో చాలా అరుదైనదని,కామిరెడ్డి సూరిబాబు సేవా దృక్పథానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, సూరిబాబు మరింతమందికి సేవ చేయాలని పలువురు సూరిబాబును కొనియాడారు…
You may also like
-
కార్మికులుమా గోడు వినండి మహాప్రభో
-
శ్రీశైల దేవస్థానం లో పరిచారకుడు రెహమత్ విద్యాధరు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
-
చెరుకుపల్లి టౌన్ అధ్యక్షులు సొంటి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్లు పంపిణీ
-
విజయ రాఘవ వర్ధంతి సందర్భంగా పండ్లు బ్రెడ్డు పంపిణీ…
-
శ్రీశైలం లో మెగా క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైనది.