కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రలో మార్పు
-ఆలూరు బైపాస్ రోడ్డు గురడి రెడ్డి కాపు నుండి పాదయాత్ర
-శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం
-పాల్గొననున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, మీనాక్షి నటరాజన్,
-టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జీలు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 02:(అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు శనివారం ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు నుండి నిర్వహించే జనహిత పాదయాత్రలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఆలూరు బైపాస్ రోడ్డు గురడి రెడ్డి కాపు సంఘం నుండి సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని, అక్కడినుండి పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి ఎక్స్ రోడ్ మీదుగా పెర్కిట్ చౌరస్తా వరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర జరుగుతుందని, పట్టణంలో సి కన్వెన్షన్ హాల్లో బస చేసి మరుసటి రోజు ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి 9 గంటల వరకు ఆలూరు గ్రామంలో శ్రమదానం, పదిన్నర గంటలకు అంకాపూర్ లో పార్టీ జెండా ఆవిష్కరణ, 11 గంటలకు అర్గుల్ రోడ్డులోని పివిఆర్ గార్డెన్స్ లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారని ఆర్మూర్ నియోజక వర్గం ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.