కామారెడ్డి జిల్లాలో మహిళా బ్లూకోల్ట్ విధులు ప్రారంభం

కామారెడ్డి జిల్లాలో మహిళా బ్లూకోల్ట్ విధులు ప్రారంభం

• జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 01, (అఖండ భూమి న్యూస్);

మహిళా పోలీసులతో కూడిన బ్లూకోల్ట్ విధులను కామారెడ్డి, దేవునిపల్లి,బిక్కనూర్, బాన్సువాడ మరియు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లలో అమలు చేయాలని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేటి తరుణంలో, ఈ శక్తి వనరులను పరిపూర్ణంగా వినియోగించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని మొదటిగా మన కామారెడ్డి జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్లలో అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.

ప్రస్తుతం బ్లూకోల్ట్ విధులు నిర్వహించే మహిళా పోలీసులతో స్వయంగా ఎస్పీ మాట్లాడి ముందస్తుగా స్వీయ రక్షణ పాటిస్తూ అనగా హెల్మెట్ ధరించి వాహనం జాగ్రత్తగా నడుపుతూ నేర నియంత్రణకు, డయల్ 100 కాల్‌కు తక్షణ స్పందించవలసి ఉంటుందని ధైర్యంగా ఈ విధులను నిర్వహించాలి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి (కామారెడ్డి), కామారెడ్డి, సదాశివనగర్ ఇన్‌స్పెక్టర్‌లు నవీన్, కృష్ణ, సంతోష్ కుమార్ (రిజర్వ్ ఇన్‌స్పెక్టర్) మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!