శ్రీశైలంలో 100 మీటర్ల పరిధిలో పిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అమ్మ రాదని
సీఐ, జి వరప్రసాదరావు తెలిపారు
శ్రీశైలం అఖండ భూమి భూమి న్యూస్,2 ఆగస్టు
శ్రీశైలం సీఐజి వరప్రసాదరావుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా SP శ్రీ అదిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు DSP రామాంజనేయ నాయక్ గారి సూచనల మేరకు శ్రీశైలం సీఐ,జి. ప్రసాదరావు మరియు సిబ్బంది రాజేంద్ర కుమార్, రఘునాథుడు, బాలకృష్ణ, నాను నాయక్ తో కలిసి శ్రీశైలంలో గల హైస్కూలు మరియు మిగిలిన పాఠశాలల నుండి 100 మీటర్ల దూరం లోపు ఉన్న షాపులలో గుట్కా, ఖైనీ సిగరెట్ల కొరకు తనిఖీలు నిర్వహించి, అదేవిధంగా విద్యార్థులకు జంక్ ఫుడ్ మరియు కూల్ డ్రింక్స్ అమ్మ రాదని దుకాణ యజమానులకు సూచనలు పైఅధికారుల ఆదేశాల మేరకు ఈ విషయాన్ని దుకాణదారులకు తెలపడం జరిగింది. అని సిఐ,జి ,వరప్రసాదరావు వారి సిబ్బందితో కలిసి దుకాణదారులకు తెలిపారు