గడువు ముగిసిన మందులను రోగులకు ఇవ్వరాదని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్ వాన్ వైద్య అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి మండలంలోని దేవన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల క్యాసంపల్లి ఆయుష్మంన్ ఆరోగ్య కేంద్రన్ని (ఉప ఆరోగ్య కేంద్రాన్ని) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆయుష్మంన్ ఆరోగ్య కేంద్రలో (ఉప ఆరోగ్య కేంద్రాన్ని) అందుతున్నటువంటి సేవల గురించి ఆరా తీశారు. రక్త పరీక్షల గదిని పరిశీలించి అవసరమైన వారికి ప్రాథమికంగా వైద్య పరీక్షలు కచ్చితంగా చేయాలని అన్నారు. అదేవిధంగా డ్రగ్ స్టోర్ ను పరిశీలించి వర్షాకాలంలో అధికంగా ఉపయోగపడే జ్వరం, విరేచనాలు, దగ్గు,జలుబు తదితర వ్యాధుల మందులను ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని, కాలం చెల్లిన మందులను ఉపయోగించారని ఆదేశించారు. వ్యాక్సినేషన్ గదిని పరిశీలించి గర్భిణీలకు, చిన్నారులకు నిర్ణీత సమయాలలో వ్యాక్సినేషన్ వేయాలని సూచించారు. రోజు ఎంతమంది అవుట్ పేషంట్లు ఈ ఆస్పత్రికి వస్తున్నారని అడిగి సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినారు.. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో అందుచున్నటువంటి సేవల గురించి తెలుసుకుని సంతృప్తి చెందడం జరిగింది..విధుల పట్ల అలసత్వం గానీ అశ్రద్ధ వహించినటువంటి సిబ్బంది పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన వాన నీటి ఇంకుడు గుంతను పరిశీలించారు.
గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఇంచార్జి పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్, దేవన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జోహా ముజీబి, క్యాసంపల్లి ఉప ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మీనాక్షి దేవి ఉన్నారు.
You may also like
-
భార్యాభర్తల మధ్య అన్యోన్య త ఉండాలంటేఏమిచెయ్యాలి కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య కామారెడ్డి ఆగస్టు 7,
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్