నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..!
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ, గోసంగి వాడ కాలనీలలో నూతన రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గత ప్రభుత్వా లు 15 సంవత్సరాల నుండి నూతన రేషన్ కార్డులు అందించడం లో విఫలమయ్యారని అన్నారు. ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా చేసుకొని నూతన రేషన్ కార్డ్ లు మంజూరు చేసి పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రేషన్ కార్డు లు పొందినవారికి ఆరోగ్యశ్రీ తో పాటు, ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలలో అర్హులని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి వారికే ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు లో మహిళల పేరిటనే మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా సన్న బియ్యం కార్యక్రమం చేపట్టిందని అన్నారు. ఎక్కడలేని విధంగా ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టి అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు, 10 లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. మహిళలు 18 సంవత్సరాలకే డ్వాక్రా గ్రూపులో సభ్యురాలుగా కొనసాగవచ్చు అని, నూతన గ్రూప్ లు ఏర్పాటు చేసుకొని సభ్యులుగా చేరి సంఘాల ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోట్లాది రూపాయలను ఆర్టీసీకి చెల్లిస్తుందని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా మహిళలు, వారి కుటుంబాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…