బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) పోలింగ్ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు..
ఓటేసిన ప్రముఖులు
తొలి గంటల్లో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, మైసూరు రాజమాత ప్రమోదా దేవి వడియార్, నటులు ప్రకాశ్‌రాజ్, ఉపేంద్ర, రమేశ్ అరవింద్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దంపతులు, భాజపా ఎంపీ తేజస్వీ సూర్య తదితరులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా క్యూ లైన్లలో నిల్చుని తమ వంతు వచ్చేవరకు వేచి చూసి ఓటు వేశారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



