దోమకొండలో పోలింగ్ బూత్ మహా సంపర్క్ అభియాన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు *మన ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి (కె.వి.ఆర్) గమ ఆదేశనుసారం *పోలింగ్ బూత్ మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా నేడు కామారెడ్డి నియోజక వర్గంలో పట్టణ, దోమకొండ మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై కరపత్రాలు, స్టిక్కర్ ల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, దోమకొండ బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరు భూపాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, కిసాన్ మోచ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, దోమకొండ పట్టణ అధ్యక్షుడు తిప్పపురం రవి, బిజెపి మండల సెక్రెటరీ జగదీష్, విట్టల్, రవీందర్ రెడ్డి, సిద్ధ రాములు, శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
You may also like
-
టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం
-
మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్
-
శుక్రవారం మద్దూరు మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన..
-
ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.టిఎన్జీవోస్ అధ్యక్షులు& జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
-
జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.