ప్రతి సెకనుకు రెండు యూనిట్ల రక్తం అవసరం…
రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సహకార బ్యాంకులో సహాయ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎల్లారెడ్డి కేంద్రానికి చెందిన లింగయ్య గారి సాయి ప్రణీత్ గౌడ్ మానవత దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు రెండు యూనిట్ల రక్తం అవసరం ఉన్నదని ప్రతిరోజు 30 మిలియన్ల రక్తాన్ని వివిధ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందజేయడం జరుగుతుందని అన్నారు. 2007లో ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడం కోసం ప్రారంభించిన రక్తదాన కార్యక్రమాలు నేటికీ రాష్ట్రమంతా విస్తరించి ప్రతిరోజు ఐదు నుండి పదిమందికి సకాలంలో రక్తాన్ని అందజేయడానికి కృషి చేస్తున్నామని రక్త దాతలు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఎలాంటి సంబంధం లేకపోయినా రక్తసంబంధంతో ప్రాణదాతలుగా నిలుస్తున్న రక్తదాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు, రక్తదానం చేసిన సాయి ప్రణీత్ కి ప్రశంస పత్రాన్ని అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు పర్శ వెంకటరమణ,లింగయ్య గారి మహేందర్ గౌడ్ లు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



