విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించి సత్తా చాటాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 2 (అఖండ భూమి న్యూస్);
విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లోని క్రీడాల్లో రాణించి సత్తా చాటాలని ఉపాధ్యాయులు పన్యాల బాపురెడ్డి, జైపాల్ రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అధ్యక్షుడు దత్తు, జిల్లా వాలీబాల్ కోశాధికారి దీపిక లు అన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడాభారతి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలోని వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడలను ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులు చదువులు ఎంత ముఖ్యమో, క్రీడల్లో రాణించి రాష్ట్ర, దేశ, విదేశాల్లో సత్తా చాటాలని అన్నారు. విద్యార్థులు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండడానికి క్రీడలకు ఎక్కువగా సమయం కేటాయించాలని అన్నారు. అన్ని రంగాల్లో రాణించి తన ప్రతిభను కనబడుచుకొని అందరికీ ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తీగల తిరుమల గౌడ్ , దోమకొండ ఆశ్చర్య అధ్యక్షుడు కదిరి మోహన్ రెడ్డి, , అంబటి అనిల్ కుమార్, మర్రి శేఖర్,దోమకొండ ఎక్సైజ్ ఎస్సై, శ్రీనివాస్, బాలకృష్ణ,, దోమకొండ సిద్ధరాములు, జీ నరేష్, సరికొండ మనీ రెడ్డి, సిరికొండ అఖిల్ చారి పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం