బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 3 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మాజీ ఎంపీటీసీ గుర్రాల రవి కుటుంబాన్ని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం పరామర్శించారు. ఐదు రోజుల క్రితం మాజీ ఎంపీటీసీ గుర్రాల రవి తండ్రి గుర్రాల పెద్ద బాలయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ బాదిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. తండ్రి లేని లోటు తీరనిదని ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మనోధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలన్నారు. గుర్రాల పెద్ద బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నీరుడి శంకర్, జూకంటి మోహన్ రెడ్డి, దుబ్బని శ్రీకాంత్, మచ్చ భాస్కర్, సింహం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!