జోగిపేట్ లో ఉన్న Sc మహిళ కళాశాల హాస్టల్ సొంత భవనం ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు
(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 3 )
జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ జోగిపేట్ లో ఉన్న ఎస్సీ మహిళా కాలేజీ హాస్టల్ ను తక్షణమే నూతన భవనం ఏర్పాటు చేయాలి స్కూల్ కళాశాల హాస్టల్ రెండు ఒకే దగ్గర ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. బాలిక ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. విద్యార్థులకు మూత్రశాలలు సరిపడా లేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలియజేశారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కానోస్తున్న కూడా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థులకు ఏ రకంగా నాణ్యమైన విద్య అందిస్తారని ప్రశ్నించారు.పాఠశాల లను తనిఖీలు చేయడంలో ప్రభుత్వ అధికారులు కూడా విఫలమయ్యారన్నారు. వెంటనే డీఈవో ఎంఈఓ పాఠశాలలు తనిఖీలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు.విగ్నేష్, యోగేష్, విశాల్, సామెల్, మల్లికార్జున్. తదితరులు పాల్గొన్నారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



