రెసిడెన్షియల్ పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలి
*పరిశుభ్రం తోనే ఆరోగ్యం*..
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 3 )
ప్రభుత్వం సూచించిన విధంగా మెనూ పాటించాలి…
వంటగది నిరంతరం శుభ్ర పరచాలి.
వేడిగా ఉన్న పదార్ధాలనే విద్యార్థులకు వడ్డించాలి…
ఉపాధ్యాయులు ప్రతిరోజు విద్యార్థినులను గమనిస్తూ ఆరోగ్యపరిస్థితులను అడిగి తెలుసుకోవాలి.
నిర్వహణ అధికారులు కు, ఉపాధ్యాయులు కు సూచించిన
కలెక్టర్
మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ లలో కలెక్టర్ వెల్లడి
ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహణ తీరును పర్యవేక్షించారు.
విద్యార్థులతో మాట్లాడారు. మెనూ బోర్డ్ ను పరిశీలిస్తూ భోజనం ఎలావుంది? మెనూ ప్రకారంగా పెడుతున్నారా? అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులందరు పాఠశాలలో ఉండాలని, 100 శాతం హాజరు నమోదు ఉండాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో లక్ష్యాలను నిర్ధేశించుకొని విద్యాపరంగా ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగ పరచుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
వంట శాలను సందర్శించి విద్యార్థుల కొరకు వండిన ఆహార పదార్ధాలు పరిశీలించారు. స్టోర్ రూమ్ ను సందర్శించి నిల్వ చేసిన సరుకులను పరిశీలిస్తూ నాణ్యమైన సామగ్రిని తెప్పించుకోవాలన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి సామర్థ్యాలను పరీక్షించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
చదువులో చక్కటి తెలివితేటలు,ఏదైనా సాధించగల సామర్థ్యం ఉన్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని వారి సామర్ధ్యాలకు పదును పెట్టి ఉత్తమ విద్యా బోధన అందించినట్లయితే భావి భారత పౌరులుగా సమాజం గర్వించే విధంగా
ముందుకు పోతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు