రెండు తెలుగు రాష్ట్రాలకు కోఆర్డినేటర్ గా పదవి పొందిన వెంకటేశ్వర్లు

రెండు తెలుగు రాష్ట్రాలకు కోఆర్డినేటర్ గా పదవి పొందిన వెంకటేశ్వర్లు

పల్నాడు జిల్లా కి చెందిన విద్యావేత్త, ముప్పూరి వెంకటేశ్వర్లు కు మాగులురి మానవ హక్కులు సంఘం, కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వం రిజిస్టర్ సంస్థ నందు ముప్పూరి వెంకటేశ్వర్లు ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమిస్తూ ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు మరియు ఫౌండర్ ప్రెసిడెంట్ మాగులురి రమేష్ ప్రసారమాధ్యమాల ద్వారా ఐడెంటిటీ కార్డు, నియామకమైనట్టు విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే భౌతికంగా నియామక పత్రాన్ని మరియు హ్యూమన్ రైట్స్ కిట్ నీ పోస్టల్ ద్వారా గాని లేదా నేరుగా గాని అందజేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ముప్పూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం మన ప్రదేశాల్లో ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు నేరం మరియు అవినీతి వ్యతిరేకంగా పోలీసులు, సిబిఐ, సిఐడి విజిలెన్స్, ఇతర ప్రభుత్వ శాఖలో ప్రజలకి అన్యాయం జరగకుండా చూడడం. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కలగకుండా చూడడం. ప్రతి వ్యక్తి భారత రాజ్యాంగపరంగా అన్ని హక్కులు సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి వ్యక్తిని కూడా చైతన్యపరిచి ఎవరు హక్కులవారు సద్వినియోగం చేసుకునే విధంగా తీసుకెళ్లడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు సంస్థ జాతీయ అధ్యక్షుడు ఆదేశానుసారం నేటి నుంచి 50 మంది సభ్యులను జిల్లా వారీగా కమిటీలు వేసి తద్వారా కార్యక్రమాలు నిర్వహించే పూర్తి బాధ్యత చేపట్టడం జరిగింది.ఈ యొక్క తెలుగు రెండు రాష్ట్రాల హెూదాను ఇచ్చినందుకు జాతీయ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ హెూదాను కలిగినందుకుగాను మిత్రులు శ్రేయోభిలాషులు,తదితరులు అభినందనలు తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!