తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో హాస్టల్ గదిలో ఆత్మహత్య…

తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో హాస్టల్ గదిలో ఆత్మహత్య…

చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య..

ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా..

ఎలాంటి కుటుంబ కలహాలు లేవన్న బంధువులు..

కుటుంబ కలహాల ,?..

క్యాంపస్ లో ఇతర కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసుల ఆరా.?

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 4 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా భిక్కనూరు సమీపంలోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలో కలకలం లేపింది. ఇప్పటివరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన అశ్విని ,(24) తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో పీజీ తెలుగు విభాగం రెండవ సంవత్సరం చదువుతుంది ఆదివారం రాత్రి వసతి గృహంలోని తన గదిలో చున్నీ తో ఉరివేసుకునీ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూరు మండల కిష్టాపూర్ గ్రామానికి చెందిన అశ్విని (24) తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో పీజీ తెలుగు విభాగం చదువుతున్న ఆమె ఆదివారం రాత్రి తన గదిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో విద్యార్థులు తలుపులు ధ్వంసం చేసి గదిలోకి వెళ్లారు. ఉరి వేసుకున్న సంఘటన చూసి దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వారిని వెంటనే కామారెడ్డికి తరలించాలని వైద్య సిబ్బంది ఆదేశించడంతో కామారెడ్డికి తరలించారు. వైద్య చికిత్సలు చేస్తూ విద్యార్థి మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు క్యాంపస్ కు చేరుకొని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని తరలించారు. విద్యార్థిని అశ్విని ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపాల్ తో పాటు విద్యార్థుల ద్వారా వివరాలను సేకరించి పోలీసులు వివరాలు అడిగి సేకరిస్తున్నారు.

విద్యార్థిని అశ్విని కి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎలాంటి కుటుంబ కలహాలు లేవని మృతురాలు బంధువులు ఆరోపించారు. తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరిగిందో వివరాలు తెలియాల్సి ఉందని మృతురాలి బంధువులు వాపోయారు.

మృతురాలి ఆత్మహత్య గల కారణాలపై వివరాలు సేకరణ?

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థిని అశ్విని ఆత్మహత్య గల కారణాలపై పలువురు విద్యార్థులతో, క్యాంపస్ సిబ్బందితో వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలపై క్యాంపస్ తో పాటు కుటుంబ సభ్యుల వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!