ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి… కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి…

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 4 (అఖండ భూమి న్యూస్);

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 142 ఆర్జీలను సమర్పించారు. ఫిర్యాదుదారుల నుండి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, లోకల్ బాడీస్ చందర్ నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!