బిజెపి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం

బిజెపి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 4.(అఖండ భూమి న్యూస్);

బిజెపి పార్టీ రానున్న స్థానిక సంస్థల జెడ్పిటిసి , ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల దిశగా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏ విధంగా నిధులను ఇచ్చి ప్రజల సమస్యలను సహకార దిశగా ముందుకు వెళ్ళిందో మాచారెడ్డి మండలంలోని గజ్య నాయక్ తండా లో ప్రతి ఇంటికి ప్రతి గడపగడపకు ప్రజల వద్దకు స్టిక్కర్ , కరపత్రాన్ని తీసుకువెళ్లి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బిజెపి పాత్రను ప్రజలకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పథకాలను, అభివృద్ధిపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలను తీరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చగలిగేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మండల అధ్యక్షులు బుస సురేష్ అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కేవలం బిజెపి పార్టీ పక్షాన ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి తప్పకుండా రానున్నదని అన్నారు.

బిజెపికి మద్దతు ఇచ్చేవారు 9240015366 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ నరేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, హారిక, బాలచంద్ర, కిషన్ గౌడ్,కళ్యాణ్ ,రవి,భరత్,ప్రభాకర్, రాహుల్,శ్రీనివాస్,స్వామి,చంద్రగౌడ్, నరేష్ , కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!