దివ్యాంగులు తయారుచేసిన రాఖీల ప్రదర్శనను పరిశీలించిన కలెక్టర్…

దివ్యాంగులు తయారుచేసిన రాఖీల ప్రదర్శనను పరిశీలించిన కలెక్టర్…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 4 (అఖండ భూమి న్యూస్);

కలెక్టర్ కార్యాలయం లో భిక్కనూర్ మండలంలోని పునరావాస కేంద్రం నందు గల దివ్యాంగుల ద్వారా తయారు చేయబడిన రాఖీల ప్రదర్శన జరిగింది. కలెక్టర్ గారి అనుమతి తో సిబ్బంది కలెక్టర్ ప్రాంగణం లో స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ రకాల దివ్యంగులు తయారు చేసిన రాఖీలు ఆకర్షణ గా నిలిచాయి. ఇట్టి కార్యక్రమాన్ని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించి డబ్బులు చెల్లించి మొదటి రాఖీ కొనుగోలు చెసి దివ్యాంగులలో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు విరివి గా నిర్వహిస్తూ దివ్యాంగులను ప్రోత్సాహించాలని కలెక్టర్ సలహాను అందించారు.

ఈ కార్యక్రమం కలెక్టరేట్ కి వచ్చిన పలువురి ని ఆకర్షించింది

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డి ఆర్ డి ఏ పి డి సురేందర్ , ఏపీడి విజయలక్ష్మి , డీపీఎం హెచ్ డి శ్రీనివాస్, ఏ పీఎం సాయిలు, సీసీ హరిలాల్ , ఎన్ హెచ్ సి ప్రొఫెషనల్స్ డిఆర్ నవీన్, శ్రీరాముల , స్పీచ్ తెరపిస్ట్ రాధిక, స్పెషల్ ఎడ్యుకేటర్ రేణుక మరియు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు ఇతరతర అధికారులు, సభ్యులు పాల్గొనడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!