కామారెడ్డి జిల్లా కేంద్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 5 (అఖండ భూమి న్యూస్);

కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ ప్రజెంటేషన్ పాయింట్ ( పి పి పి) ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంప గోవర్ధన్ గారి పార్టీ ఆఫీస్ లో ఎల్ఈడి స్క్రీన్ పెట్టి జిల్లా ముఖ్యనాయకులు సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విక్షించారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ & మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, జుక్కల్, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజల సురేందర్, కామారెడ్డి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ జుబేర్ మరియు కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!