కొండపాక మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించిధి.

కొండపాక మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా సందర్శించిధి.

 

(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )

బుదవారం కొండపాక మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆక

స్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ మరియు లీవ్ లెటర్లు, ఓ పి రిజిస్టర్, ఫార్మసీ రిజిస్టర్ వెరిఫై చేశారు. నోటి మాటతో సెలవు మంజూరు చేయవద్దని తప్పనిసరిగా లెటర్ పెట్టాలని డాక్టర్ శ్రీధర్ ను ఆదేశించారు. మండలంలో ఆయుష్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఆక్టివిటీస్ గురించి ఆరా తీసి యోగా వల్ల బెనిఫిట్స్ తెలుపుతూ ఎక్కువ మంది పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయుష్ డాక్టర్ రజినీ తెలిపారు. ల్యాబ్ లో రోజు వారిగా ఎన్ని పరీక్షలు, ఎక్కువ ఏలాంటివి వస్తాయని విషయాలు ఆరా తీసి సీజనల్ వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి అన్ని పరికరాలు ఉంచుకోవాలని తెలిపారు. మెడిసిన్ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. లోపల ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అటెండర్ కు తెలిపారు. పిహెచ్సి బయట గ్రామపంచాయతీ వర్కర్స్ తో శుభ్రం చేసుకోవాలని డాక్టర్ ను ఆదేశించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!