తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )
తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు.
బుదవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆచార్య కొత్త పల్లి జయశంకర్ గారి జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, సిపిఓ దశరథo, ఐ అండ్ పిఆర్ డివై ఈఈ భూపాల్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధననే శ్వాసగా, ఆశయంగా భావించి తన జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి ఉద్యమం అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన అనే లక్ష్యం ప్రజల్లో నీరుగారి పోకుండా తాను నిరంతరం మేధావులు, ఉన్నత విద్యావంతులు, యువకులు మరియు ప్రజలతో నిరంతరం సభలు సమావేశాలు నిర్వహిస్తూ జాగృతం చేసే తెలంగాణ మలి ఉద్యమానికి ప్రేరణగా నిలిచి ఎప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నాను.