గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 7 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మండలంలోని గర్గుల్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లోని మౌలిక వసతులను రోగులకు అందుతున్నటువంటి సేవలను గురించి ఆరా తీశారు.
* ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి విద్యుత్ సరఫరా గురించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు అలాగే నీటి వసతి కల్పన గురించి కల్పించుట గురించి కావలసిన ఏర్పాట్లు చేయాలని గ్రామ కార్యదర్శిని మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించినారు
* రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు..
* రాత్రి వేళల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన సముదాయ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు వారిని ఆదేశించారు…
* ఆయుష్మాన్ ఆరోగ్య మందిరి కు వచ్చే రోగుల యొక్క ఔట్ పేషంట్ వివరాలు రోజువారీగా నివేదికలు రిజిస్టర్ లో అబ్స్ట్రాక్ట్ రూపంలో వ్రాసి పెట్టాలని సూచించారు..
* కావలసినటువంటి ఇతర మౌలిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించినారు..
* ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. చంద్రశేఖర్, జిల్లా ఉపవైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి దోమకొండ డాక్టర్ ప్రభు దయా కిరణ్ మరియు మండల వైద్యాధికారి డాక్టర్ జోహార్ ఇతర వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


