కామారెడ్డి లో ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేయాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 7 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ కాలనీలో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బెస్ట్ మెట్ వరకు నిర్మాణం పూర్తయినదానికి బిల్లులు మంజూరు అయ్యాయా?ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారును అడిగి ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తదని రవాణా ఖర్చులు పెట్టుకొని వాటిని తీసుకుని వచ్చి నాణ్యతగా ఇల్లు నిర్మించుకోవాలని అన్నారు. నిర్మాణం పూర్తయిన ఇంటి వివిధ స్టేజీలను బట్టి బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సాగుమాగ్రికి ఎలాంటి సమస్య తలెత్తకుండా రెగ్యులర్గా పర్యవేక్షించాలని హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి లను ఆదేశించారు.
మార్కౌట్ చేసి నిర్మాణం ప్రారంభమైన అన్ని ఇందిరమ్మ ఇంట్లో వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్ తదితరులు ఉన్నారు.
You may also like
నేషనల్ మినిస్ట్రీట్యూట్ ను సందర్శించిన తెలంగాణ విద్యాలయం దక్షిణ ప్రాంగణం విద్యార్థులు…
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రఖ్యాతి పార్టీలకు షబ్బీర్ అలీ సవాల్ …
కామారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం కాయం..
ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గులు వేసిన సర్పంచ్ ఐరేని నరసయ్య…
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!


