నేడే వరాలక్షిమి వ్రతం…
లక్షిమి ఒక్కటే ప్రధానం కాదు..
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 8,(అఖండ భూమి న్యూస్);
అలంకారం,ఆర్భాటం కాదు ముఖ్యం,భక్తి ముఖ్యం.నేడే వరలక్షమి వ్రతం!
నేడే వరలక్షిమి వ్రతం.
అష్టలక్ష్ములలో వరలక్ష్మి ప్రత్యేకమైన శ్రవణ మాసంలో పౌర్ణమికి ముందు రెండవ శుక్రవారం ఇది వస్తుంది. వరాలను ఇచ్చు తల్లి కనక దీనికి వరలక్ష్మి అని పేరు వచ్చింది. వరలక్ష్మి సాక్షాత్తు శివుడు పార్వతి కోరిక మేరకు వివరించిన కథ వృత్తాంతమే వరలక్ష్మి కథకు నాంది, ఆ కథ ఈ విధంగా ఉంది.పార్వతి దేవి భూలోకంలో ఉన్న స్త్రీల యొక్క కష్టాలు తొలగడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని శివున్ని ప్రార్థించగా శివుడు చెప్పిన వ్రతమే వరలక్ష్మీ వ్రతం. పూర్వము మగద రాజ్యమున ఉండిన నగరమఒకపురముకలదు.అది బహుసుందరమైన పట్టణం అందు చారుమతి అను ఒక సాద్వి కలదు. ఆమెసద్గుణము లకు వచ్చి ఆదిలక్ష్మి స్వప్నంలో ప్రత్యక్షమై మీ సద్గుణములకు మెచ్చుతిని నీకు కావలసిన వరములను నొసగు తలంపు నాకు కలిగెను. కావు న నీవు శ్రావణ పౌర్ణమిముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రత ము చేయుము, అప్పుడునీవు కోరిన కోరికలను తీర్చే దానిని అని మాయమయ్యాను. తెల్ల వారిన వెంటనే తన కలిగిన స్వప్నం గురించి భర్తకు వివరిం చగా సంతోషించి ఆమె నా వ్రతము చేయుటకు ప్రోత్స హించెను.ఆ స్వప్న వృత్తాం తము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూస్తుండరి. అంతలో శ్రావణం వచ్చెను అంతట చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాధులు ఆచరించి ఒకచోట ఆవుపేడతో అలికి బియ్యంతో మంటపం ఏర్పరిచిమర్రిచిగుళ్ళుమొదలగు పంచ పల్లవులతో కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మిని అవహనముచేసిసాయంత్రమైనంత అధిక భక్తితోలక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాంశ్రీరంగ థమేశ్వరీం!దాసి భూత సమస్త దేవత వనితాం లోకైక దీపాంకురం శ్రీ మన్మాంద కటాక్ష లబ్ద విభవ:బ్రహ్మేం ద్ర గంగాధరాం త్వాoత్రిలోక్య కుటుంబినీం నరసిజాo
ముకుంద ప్రియం వందే
అని స్తుతించి తొమ్మిది దారపువ్వులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచ పుష్పాలను కట్టి తోరగ్రం ధి పూజ చేయవలెను. 9 పోగుల దారంతో మొదటి ప్రదక్షణ చేయగానే కాలి అందియ్యలు ఘల్లు ఘల్లున మొగాయి. రెండోప్రోక్షణ చేయ గానే హస్తాలకు నవరత్న ఖచి త కంకణాలు జగదేక మెరిసా యి. మూడో ప్రదక్షిణంచేయగా నేసర్వభరణభవితులయ్యారువారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహం తో పాటు ఆ పట్టణం లోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండి పోయినాయి శివుడు పార్వతి కి ఈ వ్రతాన్నిసవివరం గా వివ రించెను ఈ వ్రతాన్ని ఆచరిం చిన చూసిన కూడా సకల సౌభాగ్యాలు సిరిసంప దలు ఆయురారోగ్యాలు సుత మహా ముని శౌనకాది మహర్షులకు చెప్పారు ఈ విధంగా కలియు గంలో కూడా ఈ వ్రతాన్ని చేస్తున్నారు. ఎంత భోగంతో చేస్తున్నామన్నది కాకుండా ఎంత భక్తితో చేస్తూ న్నామన్న దే ముఖ్యం.ఈ వరలక్ష్మీ వ్రతం చేయుటకు శుభముహూర్తం ఉదయం ఐదు గంటల 48 నిమిషాల నుంచి 8. 14 నిమి షాలు మరియు తొమ్మిది గంట ప్ల ఏడు నిమిషాల నుంచి 10:30 వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏడు నిమిషాల నుంచి 12:30 వరకు సాయం త్రం ఐదు గంటల 5 గంటల 52 నిమిషాల నుంచి 617 నిమిషాల వరకు శుభ ఘడి యలుగా నిర్ణయించడం అయినది. లక్ష్మీ అంటే డబ్బు కాదు ఎనిమిది లక్ష్మీల సంధా నమే వరలక్ష్మి ఆరోగ్యం, ఐశ్వ ర్యం, పంటలు సంతానం సౌభాగ్యం, పాడిపంటలు ఆహా రలేమి లేకుండా ఉండడమే నిజమైన పండగ ఉద్దేశం. లక్ష్మిమి విగ్రహం లేదా ఫోటో పక్కన ఏనుగులు,ఫొటోకు బంగారు ఆభరణాలు పండ్లు పూలతో అలంకరించి పూజ అనంతరం ఒక్కరోజు ముందు శనిగెలు నానబెట్టి ఎర్రని బ్లౌజ్ ఫీస్ లు తమలపాకులు అరటి పండ్లు ఇచ్చి పసుపు బొట్లతో వహినాలు ఇచ్చుకుంటారు.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్