తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్

 

-జయంతి వేడుకల్లో మాజీ కౌన్సిలర్ గంగ మోహన్ చక్రు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 06: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించాడని తాజా మాజీ కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు అన్నారు. బుధవారం పట్టణంలోని 15వ వార్డు రాంనగర్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గంగా మోహన్ చక్రు మాట్లాడుతూ మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా తెలంగాణ జన హృదయాల్లో నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిదని, సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి అని, ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని ఉన్నారు. యావత్ జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి దార పోసిన వ్యక్తి, జయశంకర్ జీవితం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకమన్నారు. విజయంతి వేడుకల్లో వడ్ల నర్సింలు, హనుమాన్లు, నూనె సుదర్శన్, శివలింగం, తులసిపట్వారి, సురేష్, రమణయ్య తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!