ఆనాటి తీరు గోప్యం .. నేటి తీరు బహిరంగం..!
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగస్టు 6, (అఖండ భూమి న్యూస్);
గతంలో సంసారం ‘చీకట్లోనే’ జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి, నేడు సంసారం వెలు గులోకి వచ్చి జీవితాలు చీక ట్లోమగ్గుతున్నాయి.కప్పుకోవాల్సిన వాటినిచూపిస్తూ,చూపిం చాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు.నాడు కొందరికే మందు, విందు అలవాటు
నేడు కొందరే వీటికి దూరం.
నాడు కష్టమొస్తే, కుటుంబం లోని పెద్దలు ధైర్యంచెప్పేవారు,
నేడు కొన్ని కుటుంబాలలో కల హాలకు పెద్దలే కారణమౌతు న్నారు.నాడు తినడానికి శ్రమిం చి సంపాదించే వాళ్ళం, నేడు
కదల కుండా కూర్చుని సంపా దిస్తూ తిన్నది అరగడానికి వాకింగు శ్రమిస్తున్నాం.నాడు పండ్లు, పాలు తిని బలంగా బోలెడు మంది సంతానాన్ని కని పోషించాము ఇప్పుడు సంసారం చేయడానికే మందు లు మింగుతున్నారు. ఇంకపిల్ల లెక్కడ?అందుకేగా అన్ని చోట్లా
సంతాన సాఫల్యకేంద్రాలు.
గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే,మనసు మాత్రం సాఫ్టు,ఇప్పుడు అంతా ‘సాప్ట్ వేర్ ఇంజనీర్లే’ మనసుమాత్రం హార్డు అప్పుడు వైద్యుడు ఇల్లి ల్లూ తిరిగి వైద్యం చేసేవాడు, అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి ఇప్పుడు తలకాయ నొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు ఔతోందినాడు దొంగలు ‘నట్టింట్లో’ పడి దోచుకెళ్ళేవారు,
నేడు దొంగలు దొరల్లాగా ‘నెట్ ఇంట్లో’దోచేస్తున్నారు.ఒకప్పుడు చదువులేనోడు దొంగగా మారేవాడు గతిలేక ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువు తున్నారు సైబరు నేరగాళ్ళు. అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడే వాళ్ళం,
ఇప్పుడు క్రెడిటు కార్డు మీద అప్పుతో కొనుక్కోడమే క్రెడిటు గా ఫీలౌతున్నాం.ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి, సొమ్ము చేయలేక తాగేవాళ్ళం.ఇప్పు డు రెడీ మేడు చపాతీలు పొంగలి దాంటో కూరతో సహా కొనుక్కొచ్చుకొనితింటున్నాం…చైనా నుండి ఒకనాడు పింగా ణీ వస్తువు లొచ్చేవి నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యంతోసహాఅక్కడినుంచే.
ఇది మనం సాధించిన పురోగతా లేక తిరోగమనమా
మార్పు మంచిదే కానీ ఆధునిక
కాలం లో వస్తున్న మార్పులు
మానవ జీవన మనుగడ నే
ప్రశ్నార్ధకంచేస్తున్నాయి.అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్,ఎప్పటికైనా ఒప్పుకొని పరిస్థితులు నేడు తలెత్తున్నాయి.