రీ సర్వే పైలెట్ ప్రాజెక్టుతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: పి ప్రావిణ్య, జిల్లా కలెక్టర్
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )
రిసర్వే ప్రాజెక్టులో అన్ని రికార్డులు జియో ట్యాగింగ్ చేయాలి
భవిత కేంద్రానికి ప్రత్యేక అవసరాల విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యాలా చూడాలి
ఆచార్య జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించిన కలెక్టర్
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకపురత రాకుండా చూడాలి
అందోల్ ఆర్డిఓ కార్యాలయం, భవిత సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్
భూముల రి సర్వే పైలట్ ప్రాజెక్టుతో భూ సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ పి . ప్రావిణ్య అన్నారు. బుధవారం అందోల్ ఆర్డీవో కార్యాలయాన్ని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ జిల్లా అధికారి ఐనేష్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ… భూముల రి సర్వే కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని ఆందోల్ డివిజన్ వట్పల్లి మండల పరిధిలోని షాహేద్ నగర్ (గట్టుపల్లి) గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా రీ సర్వే పైలట్ ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్ సమీక్ష జరిపారు. రిసర్వే పైలెట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తుది రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. పహానిలు, మోకాపై ఉన్న రైతుల వివరాలు, ల్యాండ్ అక్యుపేషన్ ప్రక్రియ భూముల రీమార్కులు వంటి అంశాలపై మినిట్ స్థాయిలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పైలట్ ప్రాజెక్టు ద్వారా భూసంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు . భవిష్యత్తులో భూముల విషయంలో ఉన్న సందిగ్ధతకు ఈ రిసర్వే ప్రాజెక్టు ఒక తుది నివేదికల నిలవాలని కలెక్టర్ సూచించారు. రిసర్వే కు సంబంధించిన అన్ని రికార్డులు జియో ట్యాగింగ్ చేయడం, భూహక్కుల వివరాలు డిజిటల్ రూపంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్ డి ఓ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అందోల్ భవిత కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర
అందోల్ ఆర్డీవో కార్యాలయం సందర్శన అనంతరం కలెక్టర్ ప్రావిణ్య అందోల్ లోని భవిత కేంద్రాన్ని సందర్శించారు . ఈ సందర్శనలో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు భవిత కేంద్రంలోని పిల్లలకు అందిస్తున్న , వైద్య ,విద్య, రవాణా, పునరావా స పరికరాల వంటి సౌకర్యాల వివరాలను సమీక్షించారు. బోధనా విధానాన్ని,విద్యార్థుల హాజరు రిజిస్టఋ పట్టికను , ఆహార నాణ్యతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.భవిత కేంద్రానికి విద్యార్థులు రెగ్యులర్ గా హాజరయ్యేలా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిజియోథెరపీ కౌన్సిలింగ్ స్పీచ్ తెరపి స్పెషల్ ఎడ్యుకేషన్ సపోర్టు లాంటి సేవలు సమర్థవంతంగా అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారి అభ్యసన ప్రగతిని తరచూ మూల్యాంకనం చేయాలన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిది
అందోల్ ఆర్డీవో కార్యాలయం లో నిర్వహించిన ఆచార్య జయశంకర్ జయంతి కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పాల్గొన్నారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాడి మల్లికార్జున స్వస్థ సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శి గా నిలిచారన్నారు. రైతుల కోసం నిరంతరం పోరాడిన ఆచార్య జయశంకర్ సేవలను ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది తెలంగాణ అభివృద్ధిలో ఆయన కలిగించిన ప్రేరణ గుర్తు చేశారు.
సాండ్ బజార్ సందర్శించిన కలెక్టర్:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అందోల్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరా పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు తగిన మోతాదులో ఇసుక అందించడంతో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అక్రమ రవాణాపై గట్టి చర్యలు తీసుకోని అవసరమైన కోట్ల డిమాండ్ కనుగొనండి ఇసుక సరఫరా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ)మాధురి. జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు ఐనేష్ , ఆందోల్ ఆర్డీవో పాండు, ఆందోల్ తాసిల్దార్ మధుకర్ రెడ్డి, ఎంపీడీవో రాజేష్ కుమార్, ఐ ఈ ఆర్ పి అధికారి విజయ చారి, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.