వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డ. జనసేన నాయకుడు. రొక్కల నాగేశ్వరరావు

వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డ. జనసేన నాయకుడు. రొక్కల నాగేశ్వరరావు

 

శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ అతని స్థాయి ఏంటో మర్చిపోయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించడం సబబు కాదని బోడసకుర్రులో జరిగిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు రోక్కాల నాగేశ్వరరావు హెచ్చరించారు.ఇజ్రాయిల్ మాటలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంతో కలిసి పయనించేది రాష్ట్ర అభివృద్ధి కోసమేనని,మరో పదియేళ్లు కూటమి ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లటం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తుంటే,మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను కూటమి ప్రభుత్వానికి పాలేరు తనం చేస్తున్నారా అని విమర్శిస్తారా…… ఇజ్రాయిల్ గారు మీ ఎమ్ ఎల్ సి పదవి కోసం మీరు నందిగాం సురేష్ గారి కి మీరు ఎంత కాలం పాలేరుతనం చేసారు అని మా జనసేన నాయకులు ఎప్పుడైనా మిమ్మల్ని అన్నమా అంటూ మండి పడ్డారు.పవన్ కల్యాణ్ కు ఇజ్రాయిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు రోడ్లమీద రికార్డింగ్ డాన్సులు చేస్తూ కోళ్ల పందాలు వేస్తూ మీరు ఈ స్థాయికి వచ్చారు నీ గురించి మీ వీడియోలు ప్రతి పేస్ బుక్ లో సోషల్ మీడియాలో చక్రాలు కొడుతూనే ఉంటాయి . ఇప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటాయి . అటువంటిది మీరు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీ విమర్శించడం తగదు గ్రామకమిటి నాయకులు రోళ్ళ శ్రీను మాట్లాడుతూ వైసీపీ నాయకులు మీటింగ్ లు పెట్టీ వాళ్ల కార్యచరణ ఏంటో ప్రజలకు వివరించి కోవాలి కానీ మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం తగదని అన్నారు.ముందు మీ స్తాయి ఏంటి తెలుసుకుని మాట్లాడాలన్నారు.ఈ కార్యక్రమంలో అయిల వేంకట నాగేశ్వర రావు,చింతం శ్రీను,అడపా సాయిబాబు,ఏడిద గణేష్,కలిగినేటి నరసింహారావు,ముత్యాల అజేయ రామారావు,గంట్రోతు రాజు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!