ఆర్.ఆర్ స్కూల్ లో ఆకట్టుకున్న రాఖీ పండుగ వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 7.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని ఆర్.ఆర్ స్కూల్ లో ఆకట్టుకున్న రాఖీ వేడుకలు.టీచర్ల సహకారంతో.చిన్నారులు స్పెషల్ రాఖీని తయారు చేశారు. స్కూల్ లోని విద్యార్థులు రాఖీ కట్టుకొని చెల్లికి అన్నారాక్షా అన్నాకు చెల్లి రక్ష.. మనమందరము కలిసి దేశానికి రక్షా… అంటూ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ టి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తరతరాలుగా పండగలు మన జరుపుకుంటూ దాంట్లో భాగంగానే ఈ రాఖీ పండుగను మా స్కూల్లో ఘనంగా జరుపుకోవడం జరిగిందని రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం అన్న చెల్లెలమధ్య ఆత్మీయ అనురాగాలు కలగలిపి ఈ రాఖీ పండుగ జరుపుకోవడం జరుగుతుందని మా పాఠశాలలో ప్రతి పండుగను జరుపుకోవడం జరుగుతుందని దానికి సంబంధించిన విశిష్టతను పిల్లలకు వివరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ టి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు లక్ష్మరాజo, రామ్ రెడ్డి, రామచంద్రం, రాణి, శ్రీనివాస్, విజయ, రాణి, మౌనిక,మానస,గోపు రాజు, రేఖ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



