చేనేత కార్మికులు ఆర్థికంగా బలోపేతం కావాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 7 (అఖండ భూమి న్యూస్);
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని దోమకొండ కోట గ్రామ అభివృద్ధి సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి గౌరవ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై చేనేత జెండాను ఆవిష్కరించారు. దోమకొండ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చేనేత ఉత్పత్తులను చేనేత కార్మికులను ప్రశంసిస్తూ మునుముందు ఇదేవిధంగా పురోగతిని సాధిస్తూ మహిళలు జీవనోపాదులను మెరుగుపరుచుకుంటూ ఆర్థిక స్థిరత్వం సాధించాలని పిలుపునిచ్చారు. చేనేత కార్మికులు రాణించాలని, ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కులవృత్తులపై ఆధారపడి చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని అన్నారు. చేనేత మహిళా శ్రామికులకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ మాజీ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, దోమకొండ చేనేత సొసైటీ అధ్యక్షులు బొమ్మెర లక్ష్మీనారాయణ, మద్దూరి భూపాల్ రెడ్డి, చింతల రాజేష్,బొమ్మెర శ్రీనివాస్,బత్తిని సిద్ధ రాములు, అనంతరెడ్డి, పాలకుర్తి శేఖర్,గంగా జమున, కొండాంజం, సిద్ధారెడ్డి , ట్రస్టు చైర్మన్ బాబ్జి ప్రతినిధులు గణేష్, వినయ్, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్ చేనేత పారిశ్రామికులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


