ఒకే కుటుంబంలోని ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ పి. ప్రావిణ్య
(పటాన్చెరువు ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )
ఓటర్లకు సులభంగా ఓటు వేసే సదుపాయం కల్పించేందుకు నజరీ నక్షల రూపకల్పనపై సమీక్ష
పటాన్‌చెరు నియోజకవర్గంలో ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నజరీ నక్షలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య, అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన ఈ .ఆర్. ఓ, సహాయ రిటర్నింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జీహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేసే విధంగా నజరే నక్షలను రూపొందించాలి. పోలింగ్ స్టేషన్‌లు ,ఆయా వార్డుల బౌండరీల లోపలే ఉండాలి అని పేర్కొన్నారు.
పటాన్‌చెరు నియోజకవర్గంలోని మొత్తం 422 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తాము నివసించే ప్రాంతానికి సమీపంలోనే ఓటు వేసేలా మ్యాప్‌లు రూపొందించాలని సూచించారు. జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న 116 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఇప్పటికే తయారు చేసిన నజరీ నక్షలను ఈ సందర్భంగా పరిశీలించారు.
నజరీ నక్షల రూపకల్పన సమయంలో సహజసిద్ధమైన కాలనీ, గ్రామ బౌండరీలను దాటి ఓటర్లను ఇతర ప్రాంతాలకు తరలించకుండా, తాము నివసించే గ్రామం/కాలనీలోనే ఓటు వియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గ స్థాయి నజరి నక్ష మ్యాప్‌ను నాలుగు రోజుల్లో సిద్ధం చేయాలని, వచ్చే సోమవారం నాటికి పటాన్‌చెరు నియోజకవర్గంలోని మొత్తం 422 పోలింగ్ కేంద్రాల మ్యాపులను పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు ఎన్నికల అధికారి/ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి, ఈ ఆర్ ఓ / పటాన్‌చెరు నియోజక వర్గం ప్రత్యేక అధికారి / అల్పసంఖ్యవర్గాల సంక్షేమశాఖ అధికారి దేవుజా, పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల సహాయ రిటర్నింగ్ అధికారులు, జీహెచ్ఎంసి , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.