అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సమీక్ష నిర్వహించారు. పలు ఆఫీసులో తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )
జిల్లాలోని పిఎచ్ సి, బస్తి దావఖాన, సిఎచ్ సి, సబ్- సెంటర్ లలో మేజర్ మైనర్ రిపేర్లు మరియు నిర్మాణం లో ఉన్న భవనాల పనుల పురోగతి గూర్చి మెడికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీర్, మున్సిపల్ ఇంజనీర్ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ….
జిల్లాలో తోటపల్లి, వర్గల్, గట్ల మల్యాల పి ఎచ్ సిలు, కొన్ని సబ్ సెంటర్ లు భవనాలు పూర్తి అన్ని సౌకర్యాలు సమకూర్చి ప్రారంభానికి సిద్ధం చెయ్యాలని డిఎం అండ్ ఎచ్ఓ కీ తెలిపారు.
15 వ ఫైనాన్స్ కమిషన్ నుండి శాంక్షన్ అయిన బడ్జెట్ నుండి పి ఎచ్ సి లో మేజర్-మైనర్ రిపేర్లు, ఎలక్ట్రిక్, రూఫ్ లీకేజీ, మరుగుదొడ్ల రిపేర్లు, కాంపౌంట్ వాల్, వాటర్ ప్రాబ్లం ఇతరత్రా శాంక్షన్ అయిన పనులకు బడ్జెట్ ప్రకారం వేగంగా పూర్తి చెయ్యాలని ఏఈ లకు తెలిపారు. అలాగే కాంట్రాక్టర్ లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేసేలా ఎల్లపుడు మానిటర్ చెయ్యాలి. కాంట్రాక్టర్ లు పనులు ఆలస్యం చేస్తున్న పి ఎచ్ సి లను ఈఈ విసిట్ చేసి పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలి. పనులు పూర్తి కాగానే కాంట్రాక్టర్ దగ్గరినుండి యూసీ సర్టిఫికెట్ తీసుకోవాలని లేనియెడల ఫైనల్ పేమెంట్ ఇవ్వకూడదని ఈ ఈ కి తెలిపారు. చిన్న చిన్న పనులు 15 రోజుల్లో అన్ని రిఫర్లు పూర్తి చెయ్యాలి. పి ఎచ్ సి లలో ఎల్లపుడు శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ లు ఎల్లపుడు మానిటర్ చెయ్యాలని బయట చుట్టూ క్లీన్ చేయడానికి గ్రామపంచాయతీ సిబ్బందితో చేయించుకోవాలని తెలిపారు. మున్సిపల్ లో ఉన్న బస్తి దావఖాన లో ఆవరణలో మున్సిపల్ అధికారులు శుభ్రం చేయించాలని మున్సిపల్ ఇంజనీర్ లకు తెలిపారు. పనులు మొదలవ్వని సబ్ సెంటర్ లకు భూమి సమస్య ఉన్నట్లయితే ఆయా మండల తహసీల్దార్ కి ప్రపోజల్ పంపాలని సబ్ సెంటర్ అవసరం లేని చోట తొలగించాలని తెలిపారు.
సీజనల్ వ్యాధులైనా మరియు డెంగ్యూ కేసులైన అప్రమత్తంగా ఉండాలని కేసులు వచ్చిన ప్రాంతాల్లో పక్కా ప్రణాళికతో హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే ఫ్యాగింగ్, స్ప్రేయింగ్ చేయించాలని అలాగే గ్రామాల్లో, మున్సిపల్ వార్డ్ లలో డ్రై డే సక్రమంగా నిర్వహించాలని మెడికల్ ఆఫీసులకు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారీ ధనరాజ్, పంచాయతీ రాజ్ ఇంజనీర్ ఈఈ శ్రీనివాస్, ఎస్ ఈ చిరంజీవులు, టీజీ ఏంఐడిసి ఈఈ తదితరులు పాల్గొన్నారు.