మహనీయుల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడం మనందరి బాధ్యత
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12)
గాంధీ అంబేడ్కర్ ఆశయాల కోసం జై భారత్ సామాజిక విప్లవ రణభేరి సభలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం
సంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ సామాజిక విప్లవ రణభేరి ఆధ్వర్యంలో ఈనెల 17న గాంధీ అంబేడ్కర్ల ఆశయ సాధన కోసం జరుగుతున్న సభను జయప్రదం చేయాలని కోరుతూ నేడు సంగారెడ్డి జిల్లా జయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ మహనీయుల చరిత్రను విద్యార్థి యువజనలకు ప్రజలకి తెలియజేయవలసిన కర్తవ్యం భారతీయులుగా మనందరి పైన ఉన్నదని గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరము నిర్వహిస్తూ మన దేశ చరిత్రను మన మహనీయుల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లి దేశ భక్తి పెంపొందిస్తూ దేశ అభివృద్ధి కోసం వారి ఆశలను ఆచరణలో పెట్టాలని అందుకోసం మనందరం కృషి చేయాలని అన్నారు. సామాజిక విప్లవరణ రణభేరి రాష్ట్ర కన్వీనర్ ఖధిజ్ఞాసి డాక్టర్ ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి నేడు అంబేద్కర్ గాంధీ ఆశయాలు అవసరమని, ఆ మహనీయుల చరిత్ర నేటి ప్రజలు తెలుసుకుని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, నిజమైన దేశభక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జై భారత్ సామాజిక విప్లవ రణభేరి నాయకులు పల్లే కిషోర్ కుమార్, శివకుమార్, రోహిత్, డా.సుమన్, మధుకర్, మాల మహానాడు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అందోల్ మల్లేష్, బి.అర్జున్ ప్రసాద్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.