బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం
(అందోల్ మండల్ అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12)
ఈరోజు అందోల్ మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలో తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం – శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమం ( ఆర్ ఏ పి) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఎ డబ్ల్యూ ఈ పి – విద్యార్థులు బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు మరియు సమస్యలు పటాల ఆధారంగా రైతులకు వివరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో భాగంగా గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో విత్తడం జరిగింది అలాగే రైతులకు ఉన్న వనరుల గురించి అలాగే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో టి ఆర్ ఎస్ వి సంగుపేట్ శాస్త్రవేత్త మాట్లాడుతూ ఈ కార్యక్రమం వల్ల గ్రామంలో ఉన్న ఆర్థిక సామాజిక మరియు ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు అని రైతులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ విస్తరణ అంశాలు అనగా ట్రాన్సాక్ట్ వాక్, చపాతీ పటం, సామాజిక పటం, వెన్ డయాగ్రం, సమస్యల చెట్టు, కాలనుగుణం పట్టిక, మాట్రిక్స్ ర్యాంకింగ్ మొదలైన వాటిని విద్యార్థులు క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ YP 1- K. ఆకాష్ , వ్యవసాయ విద్యార్థులు B. సంపత్ , బి. సన్నీ, J . కుమార్, J.విజ్ఞాన్ కుమార్, J. మహేష్ మరియు గ్రామ రైతులు నర్సింలు , అశోక్ , సాయిలు, రాములు, జయంత్ గౌడ్ మరియు తది తరులు పాల్గొన్నారు.