కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ,ఆగష్టు9,( అఖండ భూమి న్యూస్)
సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతల కు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు శివాలయాలలో ప్రత్యేక పూజలు యజ్ఞాలు భక్తులు నిర్వహించి అత్యంత వైభవంగా రాఖీ పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు వేలాదిమంది భక్తులు మహిళలు చిన్నలు తేడా లేకుండా అందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆలయాల దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నూలు పున్నమి సందర్భంగా శివాలయాలను రంగురంగుల పూలదండలతో పాటు రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు ఉదయం నుండి భక్తులు పవిత్ర స్థానాలు ఆచరించి చెరువు నుండి నీటిని తీసుకువచ్చి శివలింగంపై కుంబాభిషేకం నిర్వహించారు ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట్లో సోదరి మణులు తమ సోదరులకు రాఖీలు కట్టి అప్యాయతను చాటారు. యువతులు, మహిళల సందడితో ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. సోదరులకు సోదరీమణులు రాఖీ లు కట్టి స్వీట్లు తినిపించారు దీనితో ఇతర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సోదరీమణులు గ్రామాలకు వచ్చి వెళుతుండడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కిరిసిపోయాయి గ్రామాలలో పెద్ద ఎత్తున భక్తుల సందడి కొట్టొచ్చినట్టు కనిపించింది కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నూలుకున్న ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు సాయంత్రం వేళ అలంకరించిన ప్రత్యేక రథంపై ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భక్తులు ఊరేగించారు