పెద్దమ్మ ఆలయం పరిసరాల్లో చిరుత సంచారం
-భక్తులకు తప్పిన ప్రమాదం
-అంకాపూర్ బైపాస్ కెనాల్ వద్ద చిరుతకు రెండు మేకలను తినేసినట్లు సమాచారం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మనోహర్ ఆగస్టు 09: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్, పట్టణ శివారులోని పెద్దమ్మ ఆలయం పరిసరాల్లో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చిరుత పులిని చూసినట్లు భక్తులు చెబుతున్నారు. ఇద్దరు భక్తులు పెద్దమ్మ తల్లి దర్శనానికి వెళ్లగా ఒకేసారి పెద్ద సంఖ్యలో కోతులు పరిగెత్తుకు రావడంతో అటువైపు చూసిన భక్తులకు చిరుత పులి కనిపించడంతో భక్తులు తల్లి దర్శనం చేసుకోకుండా భయంతో బైక్ పై వెనుకకు వచ్చినట్లు భక్తులు చెబుతున్నారు. బైపాస్ రోడ్డు నుండి అంకాపూర్ వెళ్లే దారిలో కెనాల్ బ్రిడ్జి వద్ద నాలుగైదు రోజుల క్రితం చిరుత పులి రెండు మేకలను తినేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిరుత పులి ఇలా కనిపించడం మూడవసారని స్థానికులు చెబుతున్నారు.
ఫారెస్ట్ అధికారులకు సమాచారం రాలేదా..?
పెద్దమ్మ ఆలయ పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులకు తెలియదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల్లో రెండుసార్లు చిరుత పులిని చూసినట్లు భక్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు పెద్దమ్మతల్లి ఆలయం వద్ద బోనును ఏర్పాటు చేసి చిరుత పులి సంచారాన్ని పసిగట్టి పట్టుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.
You may also like
-
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాఖీ కట్టిన కామారెడ్డి తాజా మాజీ మున్సిపాల్ ఛైర్ పర్సన్…
-
అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …
-
దోపిడి బంగారం ఆభరణాలు స్వాధీనం… కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
-
గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు
-
కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగిన రక్షాబంధన్ వేడుకలు