భార్యాభర్తల మధ్య అన్యోన్య త ఉండాలంటేఏమిచెయ్యాలి కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య కామారెడ్డి ఆగస్టు 7,
(అఖండ భూమి జిల్లా ప్రతినిధి) అనోన్యదాంపత్య జీవితానికై కొన్ని సూత్రాలు నియమాలు పాటిద్దాం,సుఖమయంచేసుకుం దాం జీవితాన్నిఏ పనినైతే బాధ్యతగా తీసుకుంటామో, దానిలో అహంకారాన్ని అడ్డం రానీయక ముందుగా మన వైపునుండి ప్రారంభిం చడమే సహకారం. దాని ఆధారంగా ఆత్మీయ తను అంచనా వేయ వచ్చు.ఇంట్లో చాలా పను లుంటాయి. చాలా మటుకు వాటిని స్త్రీలే నిర్వహిస్తూ ఉంటారు. వారికి సహకరించ టం భర్త బాధ్యత.తనకు సమయం ఉన్నప్పటికీ ఆ పనిని భార్యే చేయాలి. నేనెందుకు చేయాలి? అనే ఆలోచనలోఅహంకారంఉంటుంది.త్రాసులో ఒక వైపు అహంకారం ఉంటే ఇంకొకవైవు అసమ్మతి అనాయాసంగా పెరుగుతుంది. ఆరవేసిన బట్టలు తీసి మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం ఏమంత శ్రమ కలిగించే పనులు కావు. ఈ విధంగా సహాయం చేయడం భార్యపై ఎక్కువ ప్రభావాన్ని కల్గిస్తుంది. నిజంగానే మేమి ద్దరం ఒకటే అన్న భావనను కల్గిస్తుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం లేదనిపిస్తుంది. పనులు ఎవరు ఎంత ఎక్కువ చేసినా, తక్కువ చేసినా మగవారిలో దర్పం, స్త్రీలలో హీనత ప్రదర్శింప బడుతుంటాయి. ఇది బయటకుప్రకటించకపోయినప్పటికీ, అంతరం ఎక్కువ వుతుంది. అందువల్ల ఇంటికి రాగానే బట్టలు తీయటం, ఆరవేయటం మొదలైన భార్య పనుల్లో సహాయపడినట్లయితే సహకారమనేమెరుపుమెరుస్తుం ది.ధన వ్యవ హారాలన్నీ భర్త చూస్తున్నటికీ, ఆ లెక్కలు చూడటం, డబ్బు జాగ్రత్త చేయటం వంటి విషయాలు భార్యతో సంప్రదిస్తే వారిలో విశ్వాసందృఢపడుతుంది.ధన వ్యవహా రాలన్నింటినీ భర్త తన చేతిలోనే ఉంచుకుని, భార్యకు ఏ విషయాన్ని తెలి యనీయకపోతే అది భార్య పట్ల అవిశ్వాసాన్ని హేయభా వాన్ని ప్రకటించినట్లవుతుంది. ఇంకొకవైపు భార్య ఇంటి యజమానురాలిగా కాక తాను కేవలం పనిమనిషిని మాత్రమే అనే భావాన్ని పెంచుకుం టుంది.జీవితం పట్ల స్త్రీలు ఎక్కువ శ్రద్ధ కల్గిఉంటారు. వారికి ఇంటిపనులలో సహాయపడటం అగౌరవంగా భావించనవసరం లేదు. ఇద్దరూ కల్సిపనిచేయటం వలన ఆడుకోవడంలాగా ఆనందాన్ని కల్గిస్తుంది. సహకార భావనను ప్రదర్శించటం వల్ల ప్రేమను, విశ్వాస భావనను పెంపొందింపచేసుకోవచ్చు. మధురమైన మాటలకు గౌరవంలో ప్రాధాన్యత ఉంటుంది. తిట్లు,* *చెడ్డమాటలు, కటువైన, అవమానకరమైన మాటలు మనగౌరవాన్ని పెంపొందించకపోగా, ఇతరుల గౌరవాన్ని కించపరుస్తాయి.చెడిపోయిన పనిని పొరపాటుగా భావించి శాంతిస్వరంతో ఆ విధంగా చేసే బదులు ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పాలి.దీనివలన పొరపాటును దిద్దుకునే అవకాశముంటుంది.తిట్లతోనూ, దెబ్బలతోనూ,వ్యంగ్యంతోనూ, అపహాస్యం కలుపుతూ తప్పును ఎత్తి చూపినట్లయితే గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా తయార వుతుంది. మొండితనం పెరుగుతుంది. తప్పుకు కారణాలు చెప్పే ప్రయత్నం మొదలౌతుంది. అందువల్ల తప్పుదిద్దుకునే ఉద్దేశ్యం పూర్తికాదు. ఇంతేకాక అవమానానికి ప్రతీకారం తీర్చుకోన్లనే కోరిక మొలకెత్తుతుంది.ప్రశంసించటం కూడా గౌరవమే! ప్రతివ్యక్తిలోనూ మంచిగుణాలు, దోషాలు రెండూ ఉంటాయి. మంచి గుణాలను అందరి ఎదుటా ప్రశంసించటం, లోపాలను ఏకాంతంలో చెవిలో చెప్పటంచేయాలి.గౌరవాన్ని ప్రేమను చిన్న పిల్లలు కూడా గుర్తించగల్గుతా రు. మరి అలాంటప్పుడు పెద్దవారు వీటిని అర్ధం చేసుకోలేరని అనటం సరికాదు. ఇద్దరూ ఒక రినొకరు ఆదర దృష్టితో చూసుకోవాలి. వీలైనంత వరకుమర్యాద పూర్వకంగా సంబోధించాలి. స్నేహాన్ని చిన్న చిన్న బహుమతుల ద్వారా కూడా ప్రకటించవచ్చు. చిన్న పిల్లలు తండ్రి ఇంటికి వస్తే బొమ్మలు, చాక్లెట్లు తెస్తారని ఎదురుచూస్తుంటారు. తేనట్లయితే నిరాశ చెందుతారు, అదేవిధంగా స్త్రీల మనస్సు కూడా పురుషుల నుండి చిన్న చిన్న కానుకలను కోరుకుంటుంది. ముఖ్యంగా పండుగలప్పుడు, పుట్టినరోజు, పెళ్లి రోజు మొదలైన విశేష దినాలలో, ఆ కానుకలు తక్కువ ఖరీదైనవి అయినప్పటికీ ఎంతో అమూల్యమైనవిగా భావిస్తారు.దీని వలన పరస్పర సౌజన్యం వృద్ధి చెందుతుంది. పరస్పర అభివాదం చేసుకునే అలవాటు ఇంతకు ముందు రోజులలో లేనప్పటికీ వాటిని కొత్త విధానాలతో సాగించవచ్చు.ఇటువంటి విషయాలను కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరించాలి. భార్యనుండి సహాయాన్ని ఆజ్ఞా పూర్వకంగా కాక అడిగి చేయించుకోవాలి. ఇంట్లోని పనులను కలిసిమెలసి చేసుకోవాలి. వీలయితే చిన్న చిన్న బజారు పనులను స్త్రీలతో చేయించాలి. దీని వలన వారికి అనుభవం సాహసం, జ్ఞాన వృద్ధి కల్గుతాయి.ఈ విధంగా ఇంటి పనులలో స్వయంగా వారే కాక, పిల్లలు కూడా పాలు పంచుకునే విధంగా చేయటం మంచి సంప్రదాయం.దాంపత్య జీవనాన్ని సరసంగానూ, ఫలవంతంగానూ చేయడంలో పురుషులు వారి దృష్టికోణాన్ని మార్చు కోవల సిన అవసరం ఉంది.చిరకాలం నుండి స్త్రీని హీనంగానూ, పురుషుడిని శ్రేష్టుడుగానూ భావించే వారు. కాని నేటి స్త్రీలు వారి చదువుతోనూ సాహసంతోనూ అది గడిచిపోయిన భావనగా మార్చారు. దానిని కాలానుగుణంగా స్తీ, పురుషులను అన్ని విధాలా యోగ్యులుగానూ, గౌరవంగానూ ప్రగతి పధంలోనికి నడిపించాలి.
You may also like
-
ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ పి హెచ్ సి ఇబ్రహీం నగర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్
-
నూతన గృహ ప్రవేశం లో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి
-
లక్ష్యంగా ప్రజా పాలన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
-
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్
-
సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్