వృక్షాలను రక్షిస్తే మనల్ని రక్షిస్తాయి…

*వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి…

 

డా.రాజేశ్వరి..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 8 (అఖండ భూమి న్యూస్);

 

వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని సౌత్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్ డా.రాజేశ్వరి అన్నారు.రక్షా బంధన్ ను పురస్కరించుకొని సౌత్ క్యాంపస్ లో వృక్షాలకు రాఖీ లు కడుతూ వృక్షాబంధన్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

 

అన్న చెల్లెళ్ళు ఒకరికొకరు రక్షగా ఉంటామని ప్రేమ ఆప్యాయతలతో జరుపుకొనే రక్షా బంధన్ ను వృక్షాలను అదే ఆప్యాయతతో రక్షించాలని పిలుపునిస్తూ సౌత్ క్యాంపస్ జాతీయ సేవా సంస్థ ( NSS) ఐదవ ఆరవ యూనిట్ ల ఆధ్వర్యంలో నిర్వహించటం అభినందనీయం అని డా.రాజేశ్వరి అన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనేది అందరూ గుర్తించాలని అన్నారు. రోజు రోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతున్న పరిస్థితుల్లో వాతావరణ రక్షణ కోసం చెట్లను పెంచాలని బాధ్యతగా కాపాడాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు.

ఎన్ఎస్ఎస్ అధికారి డా.అంజయ్య మాట్లాడుతూ గతంలో చెట్ల రక్షణ కోసం మహిళలే ముందుకు వచ్చి చిప్కో ఉద్యమానికి ఊతం ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళు ప్రేమతో అన్న తమ్ముళ్ళకు కట్టే రాఖీలు చెట్లకు కట్టి వాటిని బాధ్యతగా కాపాడతామనే ఆలోచన పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ప్రజలంతా అలా ఆలోచించి వాతావరణ కాలుష్యం తగ్గించేలా చెట్లను పెంచాలన్నారు. ప్రతీ విద్యార్థి ఒక్కో మొక్కను దత్తత తీసుకొని కాపాడేలా రాఖీ కట్టించామని తెలిపారు. ఇది అందరికీ ఆదర్శం కావాలని అన్నారు.

కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లు డా.సునీత,డా.యాలాద్రి, ఏపీఆర్ఓ డా.సరిత పిట్ల,అధ్యాపకులు డా.నర్సయ్య , లైబ్రేరియన్ రజిత, నాన్ టీచింగ్ సిబ్బంది బాలరాజు,సత్తయ్య,రాజు విద్యార్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!