ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగడంతో.. సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభం అయింది.
దీంతో అందుబాటులోకి రెండు వేల మెగావాట్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ వినియోగం తగ్గడంతో యూనిట్లను అండర్ రిజర్వ్ షట్ డౌన్ లో పెట్టింది NTPC. ఇక ఇప్పుడు సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభించారు. ఏపీలో కరెంట్ కోతలు లేకుండా.. ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే, నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



