కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను వార్షిక తనిఖీ చేసిన … కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ 

 

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను వార్షిక తనిఖీ చేసిన … కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్

కర్నూలు మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ను కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు , జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారితో కలిసి బుధవారం వార్షిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ముందుగా పోలీసు గార్డు సిబ్బంది కర్నూలు రేంజ్ డిఐజి గారికి గౌరవందనం చేశారు. అనంతరం దర్యాప్తులు, పెండింగ్ కేసుల పురోగతి పై వివరాలను ఆరా తీసి , క్రైమ్ రివ్యూ చేశారు.  సీజ్ చేసిన వాహనాలు, పోలీసుస్టేషన్ పరిసరాలను పరిశీలించారు.నూతన పోలీసుస్టేషన్ నిర్మాణానికి ప్రతిప్రాదనలు సిద్ధం చేయాలన్నారు. డిఐజి గారు, పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళా పోలీసులతో మాట్లాడారు. పనితీరు గురించి సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. పోలీసు సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని డిఐజి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ సిఐ తబ్రేజ్, ఎస్సైలు ఉన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం – కర్నూలు.

Akhand Bhoomi News

error: Content is protected !!