ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే

 

దిల్లీ అఖండ భూమి వెబ్ న్యూస్ :

రాజధాని దిల్లీ (Delhi)లో పాలనా సర్వీసులపై (Administrative Services) నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సర్కారుకు సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ విజయం లభించింది..

ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది..

Akhand Bhoomi News

error: Content is protected !!