హైదరాబాద్ ఉగ్రవాదుల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్నట్లుగా ఏటీఎస్ గుర్తించింది..
హైదరాబాద్‌లో మరోసారి ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రవాద మూలాలు కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అధికారులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో అరెస్టైన ఆరుగురు, భూపాల్ లో అదుపులోకి 11 మందిని ఏటీఎస్ అధికారులు కోర్టులో హాజరు పర్చారు. దీనికి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే19 వరకు కస్టడీ విధించింది..
విచారణలో భోపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది..
కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ నిర్వహించాగా..మహమ్మద్ సలీల్, అబ్దుల్ రెహ్మాన్, షేక్ జునైద్, మహమ్మద్ అబ్బాస్, హమీద్ లను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో సలీమ్ ఓ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీగా పని చేస్తున్నాడు. అబ్దుల్ రెహ్మాన్ ఎంఎన్ సీ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. షేక్ జునైద్ పాతబస్తీలో డెంటిస్ట్ గా పని చేస్తున్నాడు. మరో ఇద్దరు మహమ్మద్ అబ్బాస్, హమీద్ రోజువారీ కూలీలు. సల్మాన్ అనే కూలీ పరారీలో ఉన్నాడు. సల్మాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పట్టుబడ్డ వారికి హిజ్బుత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు..
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



