కామారెడ్డి పట్టణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు…

కామారెడ్డి పట్టణ బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 9 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని త్రిశక్తి పీఠం ఆలయంలో జరిగిన రక్షాబంధన్ వేడుకలలో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి శనివారం పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణ బ్రాహ్మణ పరిషత్ వాడి ఆహ్వానం మేరకు ఈ రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరు అన్నా చెల్లికి, అక్క తమ్ముడితో పాటు ప్రతి ఒక్కరు సోదర భావంతో ఈ బంధాన్ని ముడి వేసుకోవడానికి రక్షాబంధన్ పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో రాణించి ఆర్థికంగా బలపేతం కావడమే కాకుండా దేశానికి ధనవంతు సహకారం అందించే విధంగా ప్రతి రంగంలో రాణించి దేశ ప్రతిష్టను కాపాడాలని అన్నారు. మనం బాగున్నప్పుడే దేశం బాగుపడుతుందని ప్రతి ఒక్కరు ఒకరికొకరు రక్షతోపాటు దేశానికి రక్షగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వాసులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!